హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు పంపిణీ

ATP: గుమ్మఘట్ట మండలం మరేంపల్లి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పంపిణీ చేశారు. రైతుల భూములకు భరోసా కల్పించి, హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, వారి సమస్యలను పరిష్కరించి అండగా నిలుస్తామని తెలిపారు.