హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపిలో సీఎం చంద్రబాబు పర్యటన

ప్రకాశం: కొండపిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ముప్పాళ్ల వద్ద రూ.27.85 కోట్ల వంతెన నిర్మాణానికి, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్‌వే, స్లూయిజ్ గేట్ల పనులకు శంకుస్థాపన చేశారు. గర్భ కండ్రికలో భూ వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టి రైతులకు హక్కు పత్రాలు అందించనున్నారు. పలువురు మంత్రులు హాజరయ్యారు.