హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు తప్పనిసరి: ఎస్సై

BHPL: గోరికొత్తపల్లి మండలంలో దుర్గా మాత విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తెలంగాణ పోలీస్ శాఖ పోర్టల్ ద్వారా ముందస్తుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సై త్రిలోక్ నాథ్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.