హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10 వీల్ చైర్లు విరాళం ఇచ్చిన అహుడా ఛైర్మన్

ATP: అనంతపురం సర్వజన ఆస్పత్రికి 'వీల్ చైర్ బ్యాంక్' కార్యక్రమంలో భాగంగా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ 10 వీల్ చైర్లను విరాళంగా అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆస్పత్రి అభివృద్ధికి సహకరిస్తూ పింక్ టాయిలెట్లను నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా వరుణ్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.