హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగరాలి: ఉషశ్రీ చరణ్

సత్యసాయి: పరిగి మండలంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారిని గుర్తించి గౌరవించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామాన పార్టీ జెండా ఎగురవేసేలా అందరూ కృషి చేయాలన్నారు.