హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంటి కాలిపై నిలబడి వీఆర్ఏల నిరసన

NDL: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వీఆర్ఏలు నిరసన చేపట్టారు. వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో 24వ రోజు దీక్షలో భాగంగా ఒంటి కాలిపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.