అన్నమయ్య: స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు DIG కోయ ప్రవీణ్ తెలిపారు. శుక్రవారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆయుధాల డిపాజిట్‌తో పాటు బలహీన వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిని బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు: DIG


