అన్నమయ్య: పీలేరు పట్టణంలోని చిత్తూరు రోడ్డులో ఆర్జేబీ పనులు జరుగుతున్న ప్రాంతంలో బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టడంతో డ్రైవర్ ఎస్. మస్తాన్ (50) మృతి చెందాడు. బోయపాలెం వీధికి చెందిన మస్తాన్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెన్నై నుంచి సుండుపల్లికి వెళ్తున్న బొలెరో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి


