హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు..!

ఫ్రిజ్‌లో కొన్ని ఆహార పదార్థాలను అసలు పెట్టకూడదు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడవుతాయి, మొలకలు వస్తాయి. టమాటాలు రుచి కోల్పోతాయి. తేనె గడ్డకట్టుకుపోతుంది. అరటిపండ్లు, మామిడిపండ్లు వంటివి సాధారణ ఉష్ణోగ్రత వద్దే పండాలి. కాఫీ గింజలు తేమను పీల్చుకుంటాయి. బ్రెడ్ తొందరగా ఎండిపోతుంది. కాబట్టి వీటిని బయటే ఉంచడం మంచిది.