హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

దానిమ్మ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు

దానిమ్మ పండు ఆరోగ్యానికి అద్భుతమైన వరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. రోజువారీ ఆహారంలో దానిమ్మ చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.