హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ నెయ్యి తిన‌డం మంచిదేనా..?

రోజూ నెయ్యి తినడం గుండెకు చెడు చేస్తుందా? అనే అనుమానం అందరిలో ఉంటుంది. అయితే ఇది మోతాదుపై ఆధారపడి ఉంటుంది. మితంగా (రోజుకు 1-2 చెంచాలు) తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, పరిమితి దాటితే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.