హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరాకు 1,233 ప్రత్యేక బస్సులు

KDP: దసరా సందర్భంగా కడప RTC జోన్ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో 1,233 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జోన్ ఈడీ కిశోర్ తెలిపారు. బెంగళూరుకు 350, హైదరాబాద్‌కు 160, చెన్నైకి 70, విజయవాడకు 75, ఇతర ప్రాంతాలకు 578 బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 21 వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని, సాధారణ టికెట్ ధరలే వసూలు చేస్తామని పేర్కొన్నారు.