హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హంద్రీ-నీవా కాలువ సామర్థ్యం పెంపు పనులకు భూమిపూజ

సత్యసాయి: సోమందేపల్లి మండలం పందిపర్తి వద్ద హంద్రీ-నీవా మడకశిర ఉపకాలువ నీటి సామర్థ్యం పెంపు పనులకు బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత భూమిపూజ చేశారు. రూ. 790.38 కోట్లతో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 408 క్యూసెక్కుల నుంచి 642 క్యూసెక్కులకు పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రాంతీయ సాగు, తాగునీటి ఎద్దడి నివారణకే ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.