హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తాం: ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.