హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాశ్వత డాక్టర్‌ను నియమించాలని డిమాండ్

KRNL: ఆదోని శంకర్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో శాశ్వత వైద్యుడిని నియమించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.