హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు పోలీసుల అవగాహన

CTR: పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలీసులు విద్యార్థులకు మహిళలపై నేరాలు, బాల్యవివాహాలు, పోక్సో చట్టం, సైబర్ మోసాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 112, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930, బాలల సహాయం కోసం 1098 నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.