కృష్ణా: వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉయ్యూరులో జేఏసీ నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏల నిరసన


