హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో తపాలా సిబ్బందికి సన్మానం

W.G: ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా నరసాపురం యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక పోస్ట్ ఆఫీసులో తపాలా సిబ్బందిని సన్మానించారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమగోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి సిబ్బందికి సన్మానాలు అందజేశారు. తపాలా సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.