JGL: అల్లిపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతి చదువుతున్న బట్టు అనన్య రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. కోరుట్లలో నిర్వహించిన అండర్-12 జిల్లాస్థాయి 300 మీటర్ల పరుగులో ప్రతిభ కనబరిచింది. ఈ నెల 11న ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా హెచ్‌ఎం కిరణ్‌కుమార్‌తో పాటు సర్పంచ్ గౌతమి, గ్రామస్తులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి పోటీలకు అల్లిపూర్ విద్యార్థిని


