హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి మండలం గొప్పిలిలో రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. భూమి హక్కుల వివరాలను పక్కాగా నమోదు చేసి రైతులకు మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతుల సంక్షేమం, భూమి హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.