GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే


