హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మ ఆలయానికి రూ.3 లక్షల విరాళం

TPT: నాయుడుపేట మండలంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ రఫీ రూ.3 లక్షల విరాళం ప్రకటించారు. ఆలయ పునర్నిర్మాణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా సోదరభావంతో మెలగాలని కోరారు.