హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్...టీడీపీలోకి మాజీ సర్పంచ్

కోనసీమ: కపిలేశ్వరపురం కేదార్లంక గ్రామ మాజీ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. తన అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా మండపేట టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.