హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీ హాస్టళ్లలో పోలీసుల తనిఖీలు

అన్నమయ్య: బోయినపల్లి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మన్నూరు సీఐ లింగప్ప ఆధ్వర్యంలో పోలీసులు పీజీ హాస్టళ్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గదులు, పరిసరాలను తనిఖీ చేసి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.