హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

KDP: వేంపల్లె శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు కలిశారు. దసరా ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.