BPT: జిల్లా అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించగా, పర్చూరు నియోజకవర్గంలో రూ.35 కోట్ల పనులు చేపట్టినట్లు మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు. యద్దనపూడి(M) పూనూరులో ఈ వివరాలు వెల్లడించారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేస్తూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరో రూ.15 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పర్చూరు అభివృద్ధికి మరో రూ.15 కోట్లు: మంత్రి


