E.G: చాగల్లు మండలం చిక్కాలలో గురువారం రాత్రి పులి ఆవుపై దాడి చేసినట్లు గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనతో గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పులి తన దిశను మార్చుకుని ఉండ్రాజవరం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచారంపై అనుమానం వచ్చినా లేదా కనిపించినా సమాచారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చాగల్లులో ఆవుపై పులి దాడి


