హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా నిర్మూలన

ADB: అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని DYSO దయానంద్ అన్నారు. ఎయిడ్స్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఐపీ స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్‌కు 5KM ర్యాలీ నిర్వహించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించేందుకు పాఠశాల, కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.