ASR: అడ్డతీగల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మూడేళ్ల కుమారుడు ప్రశాంత్ బిర్యానీ కావాలని అడగటంతో తండ్రి ఈపూరి రవి (25) అతడిని తీసుకుని బైక్‌పై చింతలపూడి వెళ్లాడు. బిర్యానీ తీసుకుని తిరుగుపయనమవ్వగా డిగ్రీ కాలేజీ సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గత రాత్రి తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బిర్యానీ కోసం వెళ్లి తండ్రీకొడుకుల మృతి


