హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు

KMR: బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్రంలో డిసెంబర్‌ 1 నుంచి 3 వరకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వేద పండితుడు ఆంజనేయ శర్మ తెలిపారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పురాతన ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.