హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి 'మేయర్'.. రూ. 25 కోట్లు?

GNTR: మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకునేందుకు ఆయా పార్టీ నాయకులు అధిష్టానం వద్ద తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంగళగిరి మేయర్ పదవి బీసీ వర్గానికి  రిజర్వు చేసినట్లు ప్రచారం. మేయర్ పదవికి ఆశపడుతున్న ఆశావహులు రూ. 25కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికంగా చర్చ నడుస్తోంది.