హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ప్రయాణికులు సేఫ్

కాకినాడ: శంఖవరానికి చెందిన RTC డ్రైవర్ శివ (32) 30 మందికి పైగా ప్రాణాలు కాపాడి తాను మరణించాడు. కాకినాడ నుంచి విశాఖకు వెళ్తుండగా మొదట ఛాతిలో నొప్పి వచ్చింది. సాధారణం అనుకొని మాత్ర వేసుకుని మళ్లీ బస్సు స్టార్ట్ చేశాడు. అయితే నొప్పి తీవ్రం కావడంతో నక్కపల్లి వద్ద బస్సును పక్కకు నిలిపేసి సీట్లో కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.