హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రమదానంతో వీధి రోడ్ల నిర్మాణం

ASR: చింతపల్లి(M) కొత్తవలస గ్రామంలో కనీస మౌలిక సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. CC రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇటీవల వర్షాలకు సమస్యలు మరింత పెరిగాయన్నారు. దీంతో గ్రామస్థులంతా ఏకమై రాళ్లు వేసి శ్రమదానంతో వీధి రోడ్లను నిర్మించుకుంటున్నారు. అధికారులు స్పందించి వీధి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు.