హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రారంభానికి సిద్ధమైన డ్రగ్స్ స్టోరేజ్ గోడౌన్

VSP: ఆరిలోవ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో సుమారు రూ.50 లక్షల ప్రభుత్వ నిధులతో డ్రగ్స్ స్టోరేజ్ గోడౌన్ నిర్మించారు. NDPS కేసుల్లో దొరికిన గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను ఈ గోడౌన్లో నిల్వ ఉంచనున్నారు. జిల్లావ్యాప్తంగా డ్రగ్స్ నిల్వలు అన్నీ ఇక్కడే ఉంచుతారు. ప్రస్తుతం ఈ గోడౌన్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.