హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని దేవాదాయ శాఖ కమిషనర్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమైన కమిషనర్‌ దసరా, సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను సమీక్షించారు.