హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పుణ్యక్షేత్రం

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా నరసింహ జయంతి, బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం భక్తులతో సందడిగా మారుతుంది.