హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారులు ఆక్రమణలు చేస్తే చర్యలు తప్పవు-కమిషనర్

తూ.గో: రహదారులకు ఇరువైపులా ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్లో భాగంగా గ్రాండ్ ట్రంక్ రోడ్డులో ఫుట్‌పాత్‌లపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బడ్డీలను గురువారం టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలతో తొలగించారు. వీధి వ్యాపారులు పగటిపూట తోపుడు బండ్లు లేదా వాహనాలపై వ్యాపారం చేసుకోవాలన్నారు.