అన్నమయ్య: రాయచోటికి శాశ్వత తాగునీటి భరోసా కల్పిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 2,370 కోట్ల సమగ్ర పథకంతో 6 మండలాల్లోని 887 ఆవాసాలకు వెలిగల్లు జలాశయం నుంచి నీరు అందిస్తామని పేర్కొన్నారు. 26 ఎంఎల్‌డీ శుద్ధి ప్లాంట్, 156.73 కి.మీ. పైప్‌లైన్ పూర్తయిందని చెప్పారు. 49 పథకాల మరమ్మతుకు రూ. 28.78 కోట్లు మంజూరు అయినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'శాశ్వత తాగునీటి భరోసా కల్పిస్తాం'


