హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలిలో వార్డుల సంఖ్య 44 కు పెంపు

నెల్లూరు: కావలి పురపాలకసంఘం పరిధిలోని వార్డుల పునర్విభజన పూర్తి అయింది. ప్రస్తుతం ఉన్న 40 వార్డులను 44 వార్డులుగా పెంచుతూ జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ తెలియజేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 14వ తేదీలోగా సమర్పించాలని తెలియజేశారు.