హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి'

ప్రకాశం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీధర్ తెలిపారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విధివిధానాలు, నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, స్ట్రాంగ్‌రూమ్ భద్రత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలపై అధికారులకు సూచనలు జారీ చేశారు.