హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోవెలకుంట్లలో ఉత్సాహంగా 'స్పోర్ట్స్ మీట్'

NDL: కోవెలకుంట్ల సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో గురువారం స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా జరిగింది. కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి, ప్రిన్సిపల్ గీతా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు క్రికెట్, వాలీబాల్ తదితర క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.