హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్టర్‌పై మంత్రి ఆగ్రహం..!

కృష్ణా: మచిలీపట్నం గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనుల్లో జాప్యంపై మంత్రి కొల్లు రవీంద్ర గురువారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా పనులు ముందుకు సాగకపోవడంపై కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను నిలదీశారు. సీ మౌత్ డిజైన్ల పేరుతో కాలయాపన చేయడాన్ని సహించేది లేదన్నారు. కాంట్రాక్ట్ సంస్థను తొలగించి, నిధులు రికవరీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.