KMR: నాగిరెడ్డిపేట్ మండలం చీనూర్, మాల్తుమ్మెద, లింగంపల్లి, రాఘవపల్లి, రామక్కపల్లి గ్రామాల్లోని కల్లు డిపోలలో ఎక్సైజ్ CI మంగమ్మ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని CI హెచ్చరించారు.
తెలంగాణ
పలు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు


