ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండకు చెందిన నూణావత్ శంకర్ నాయక్ తెలంగాణ రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన తాజాగా రాష్ట్ర స్థాయిలో కీలక పదవిని చేపట్టడం జిల్లాకు గర్వకారణమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారిగా లింగాపూర్ వాసి


