ASF: సిర్పూర్ (యూ) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీడీవో రవీందర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. గ్రామ పంచాయతీల సామర్థ్య పెంపు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.
తెలంగాణ
నేడు మండల స్థాయి సమీక్ష సమావేశం


