KMM: కల్లూరు మండలం రఘునాథగూడెం భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గురువారం రైతులతో కలిసి పరిశీలించారు. భూముల నమోదు, సీలింగ్ భూముల గుర్తింపు, పట్టా భూముల రికార్డుల్లో వ్యత్యాసాలను పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, క్షేత్రస్థాయి పరిస్థితులతో సమగ్రంగా పరిశీలించి పరిష్కరిస్తామని రైతులకు స్పష్టం చేశారు. రీ-సర్వేతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్


