HYD: బేగంబజార్‌లో వాచ్ వ్యాపారిని కత్తితో బెదిరించి రూ.9.50 లక్షలు దోచుకెళ్లిన కేసులో గోషామహల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఛత్రినాకకు చెందిన వాచ్ మెకానిక్ మహ్మద్ జహీర్ అలియాస్ ఇస్మాయిల్ గురువారం చంద్రాయణగుట్టలో పట్టుకున్నారు. అతడి నివాసంలో రూ.9 లక్షల నగదు, సెల్‌ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్


