హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు SRM యూనివర్సిటీకి బ్రహ్మానందం

GNTR: మంగళగిరి ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో నేడు జరిగే అమరావతి సాహిత్య ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆయన విద్యార్థులు, రచయితలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తెలుగు సంస్కృతి, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న బ్రహ్మానందం రాకతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా మారనున్నాయి.