హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి'

ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో భూముల రీ-సర్వే పురోగతిపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో గురువారం సమీక్షించారు. అక్టోబర్ 20 లోపు ప్రతి మండలానికి రెండు రోవర్లు కేటాయించి సర్వే వేగం పెంచుతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలతో పారదర్శకంగా డిమార్కేషన్ పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.