హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్సిజన్ టవర్లో భారీగా మద్యం స్వాధీనం

VSP: సీతమ్మధార రైతు బజార్ సమీపంలోని ఆక్సిజన్ టవర్లో నివాసం ఉంటున్న ఓ ఇంటిపై నిన్న ఎంవిపి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 18 మద్యం బాటిల్స్, 19 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కెఎస్ఎన్వి ప్రసాద్ తెలిపారు. ఇటీవల అరెస్ట్ అయిన గీతా ప్రసన్న, శివ నారాయణ ఇంట్లో వీటిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.